Amaravati Drone Show: అమరావతిలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో..

ఒకటి కాదు, వందకాదు ఏకంగా ఐదువేలకు పైగా డ్రోన్లు అమరాతి గగనతలంలో షికారు చేయబోతున్నాయి.  జాతీయ స్థాయి డ్రోన్ సమ్మెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు.  ఈ డ్రోన్ స‌మ్మిట్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పున్నమి ఘాట్ దగ్గర 5వేల‌కుపైగా డ్రోన్లు 9 థీమ్స్‌పై రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటాయి. 400కి పైగా కంపెనీలు పాల్గొనే ఈ  సమ్మెట్ లో 1800 మంది డెలిగేట్స్ హాజరవుతారు.  విజేతలకు నాలుగు కేటగిరీల వారీగా సీఎం చంద్రబాబు  బహుమతులు ప్రదానం చేస్తారని నిర్వాహకులు తెలిపారు.

ఈ డ్రోన్ షోను విజయవాడ ప్రజలంతా తిలకించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నగరంలో ఐదు చోట్ల భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌, ప్రకాశం బ్యారేజీల దగ్గర వాటిని రెడీ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు డ్రోన్ షో జరగనుంది. డ్రోన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. బుడమేరు వరదల సందర్భంగా డ్రోన్లను ఎలా వినియోగించామన్న విషయంపై ప్రెజెం టేషన్ ఇవ్వనున్నారు. డ్రోన్ షోలో పాల్గొనేందుకు డెలిగేట్స్‌ ఇప్పటికే అమరావతి చేరుకుంటున్నారు. డ్రోన్ల పండగను తిలకించేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.