Center Show Cause Notices to AR Dairy :
ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను , సంప్రదాయాలను దెబ్బతీసేందుకు జరిగిన లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంపై కేంద్రం కూడా సీరియస్ గానే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి .
తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నా డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది . ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రము కూడా దృష్టి సారించింది . . ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు ఇచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం సేకరించింది. ఈ నేపథ్యంలోనే నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు పేర్కొంది. ఏఆర్ ఫుడ్స్‌తోపాటు మరికొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. సంస్థల సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత ప్రమాణాల విభాగం స్పష్టం చేసింది.