Jethwani case: జత్వాని కేసులో అరెస్ట్ కాబోయే IPS ఆఫీసర్ ఎవరు ?

ముంబయ్ నటి కాదంబరి జత్వానిపై తప్పుడు కేసులు పెట్టి, చట్ట విరుద్దంగా  హింసలకు గురిచేసిన ఐపిఎస్ అధికారులలో తొలి విడతగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అరెస్ట్ కాబోతున్నారా ?  జగన్ సర్కార్ లో ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజి గా ఉన్న ఈ అధికారితో పాటు . . అప్పటి విజయవాడ కమిషనర్ కాంతి రానా ,  డీసీపీ విశాల్ గున్ని సస్పండ్ అయిన సంగతి తెలిసిందే .  ఈ కేసులో తాజాగా వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను ఏపీ పోలీసు బృందాలు డెహ్రాడూన్ లో  అరెస్ట్ చేశాయి .            గూగుల్ టెక్ అవుట్ ద్వారా ఇప్పటికే జత్వాని కేసులో తప్పుడు రిమాండ్ ఇచ్చిన అధికారులు ,  ఇందుకు ఒత్తిడి చేసిన అధికారులపై ఇప్పటికే కీలకమైన అధరాలు దొరికాయ్ .  పూర్తి స్థాయి ఆధారాలు లభ్యమైన తర్వాతే కీలకమైన ips అధికారులను సస్పండ్ చేసారు .  మరిన్ని ఆధారాలు  దొరికిన తర్వాత వీరి అరెస్టులు జరగనున్నాయి .  ఇందులో ఇప్పటికే సీతారామాంజనేయులుకి సంబంధించి కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది .  దీనిపై సీతారామాంజనేయులును ఒకటి ,  రెండు రోజులలో అరెస్ట్ చేస్తారని పొలిసు వర్గాలలో వినిపిస్తోంది .  వీరితో పాటు అప్పట్లో ఈ కేసులో పోలీసు అధికారులపై ఒత్తిడి చేసిన అప్పటి వైసీపీ నేతలు ,  ఐఏఎస్ అధికారుల పాత్రపై కూడా విచారణ చేయాల్సి వచ్చింది .