why not fear: చంద్రబాబు అంటే సోషల్ మీడియాకు చులకన ఎందుకు ?

”ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సోషల్ మీడియా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం . .” ఇదీ చంద్రబాబు సీఎం కుర్చీ ఎక్కున దగ్గర నుంచీ చేస్తున్న వార్నింగ్ . అయితే సీఎం వార్నింగ్ ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఖాతరు చేయడంలేదు .  ప్రభుత్వంపైనా ,  కూటమి భాగస్వాములైన టీడీపీ ,  జనసేన పార్టీలపైనా ముక్యంగా వైసీపీ పెయిడ్ బ్యాచ్ దుష్ప్రచారం చేస్తూనే ఉంది .  విషం చిమ్ముతూనే ఉంది .  అయినా చంద్రబాబు ,  పవన్ కళ్యాణ్ లు మాత్రం చాతకాని వారిలా ఉండిపోతున్నారంటూ ఆయా పార్టీల కేడర్ లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

స్టేట్ మెంట్ల పులి చంద్రబాబు . .. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం . . అంటూ ఊకదంపుడుగా చంద్రబాబు 100 రోజుల నుంచీ ఏకరువు పెడుతూనే ఉన్నారు .  ఇప్పటి వరకు తప్పుడు ప్రచారం చేసే యూ- ట్యూబర్స్ . ఇతర సామాజిక మాధ్యమాలలో విషం చిమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు .  2019-2024 మధ్య కాలంలో జగన్ పై కానీ ,  వైసీపీ కానీ ,  అప్పటి ప్రభుత్వంపై కానీ చిన్నపాటి విమర్శ చేసినా కేసులు పెట్టడం ,  వేధించడం . . జరిగింది .  తప్పుడు వార్తలు కాకపోయినా . . వారికి నచ్చని వార్త వచ్చిందంటే అంతే సంగతులు .  జగన్ మాదిరి నియంతలా కాకపోయినా . . తప్పుడు ప్రచారాలను ,  విష ప్రచారాలను కట్టడి చేయడానికైనా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవాలి .  లేదంటే మరింత లోకువపోతారు .  వైసీపీ వాళ్ళే కాదు . .. చంద్రబాబుపై సొంత పార్టీలోనూ చులకన భావన ఏర్పడుతుంది . .