అమెరికాలో ఈ ఏడాది నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కమలా హారిస్- kamala Haris- ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వీరిద్దరూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆగస్టులో పెద్ద ఎత్తున విరాళాలను దక్కించుకున్నారు. 361 మిలియన్ డాలర్లకుపైగా సేకరించి డొనాల్డ్ ట్రంప్ కంటె మూడు రెట్లు ఎక్కువ సాధించారు. ఇదే సమయంలో 130 మిలియన్ డాలర్లు సేకరించినట్లు ట్రంప్ బృందం ప్రకటించింది. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ట్రంప్‌నకు గట్టి పోటీ ఇస్తున్నారు.