”పార్టీలో క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేదిలేదని టీడీపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది . .”
టీడీపీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వేటుపడింది . ఈ మేరకు టీడీపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ” సామాజిక మాద్యమాలలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే) ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది” అని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. కాగా.. సస్పెన్షన్ తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. ఆరోపణలు తీవ్రత దృష్ట్యా ముందు సస్పెండ్ చేసి తరువాత వివరణ తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై.. పార్టీకి చెందిన మహిళ కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు విడుదల చేసింది.