గుజరాత్ (Gujarat) లోని పోరుబందర్ తీరం (Porubandar coast) వద్ద ప్రమాదం జరిగింది. అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డు (Indian Coast Guard) కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కుప్పకూలింది.
రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కు వెళ్తున్న సమయంలో అత్యవసరంగా ల్యాండింగ్ (Emeregency Landing) చేస్తుండగా హెలికాప్టర్ (Helicopter) సముద్రంలో కూలింది. ఈ ప్రమాదంలో ఇండియన్ గార్డుకు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.
అయితే పోరబందర్ తీరం నుండి అరేబియా సముద్రంలోకి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో మోటార్ ట్యాంకర్ హరిలీలా (Harileela) లో గాయపడిన వారిని రక్షించడానికి సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి 11 గంటలకు హెలికాప్టర్ ను మోహరించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. కాగా రెస్క్యూ ఆపరేషన్ సమయంలోనే హెలికాప్టర్ లో సమస్య తలెత్తడంతో సముద్రంపై అత్యవసర హార్డ్ ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని పేర్కొంది. ఆ క్రమంలోనే హెలికాప్టర్ ప్రమాదవశాత్తు పడిపోయిందని తెలిపింది. వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ దళాలు (Coast Guard Forces) తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. ఒకరిని రక్షించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది గల్లంతైన ముగ్గురు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.