( రచయిత పొట్లూరి పార్థసారథి): బంగ్లాదేశ్ విఫల ప్రయోగం ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చు !అసలు పాకిస్థాన్ అనేదే విఫల ప్రయోగం అని 1971 లోనే నిరూపితం అయినప్పుడు అదే పాకిస్థాన్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్ విఫల ప్రయోగం అవకుండా ఎలా ఉంటుంది?
ఏ $2bn డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ దేబిరిస్తున్నదో అంతకంటే చిన్న దేశం అయిన బంగ్లాదేశ్ $5bn డాలర్ల కోసం చైనా దగ్గరకి వెళ్ళింది!
Ok! ప్రస్తుత సంక్షోభానికి కారణం ఏమిటి అనేది చూద్దాం!
1971 లో బంగ్లాదేశ్ విముక్తి తరువాత 1972 లో ఆ పోరాటంలో చనిపోయిన వారి కోసం అని 30% కోటా ఏర్పరిచారు ప్రభుత్వ ఉద్యోగాలలో! అంటే చనిపోయిన వారి వారసులకు 30% రిజర్వేషన్ కోటా అమలుచేస్తారు!వీళ్లలో ఎక్కువ శాతం పోరాటంలో చనిపోయిన సైనికుల పిల్లలు ఉన్నారు.
1972 నుండి రెండు తరాల వారు ప్రభుత్వ ఉద్యోగాలలో తమ కోటా ను వాడుకుంటూ వచ్చారు.ఇది ప్రస్తుత యువకులలో అసంతృప్తి కి కారణం అయింది!
1.2017 లో 3 కోట్ల 23 లక్షల మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకోసం మరియు అడ్మిషన్ల కోసం అప్లై చేశారు.
2.1975 లో 3 కోట్ల 18 లక్షల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ గా రిజిస్టర్ చేసుకున్నారు. అదే 2017 లో ఇంకో 5 లక్షల మంది ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇదే వివాదానికి తొలి మెట్టు అయింది.
3. లోపం ఎక్కడ ఉంది అంటే 1997 లో ఫ్రీడమ్ ఫైటర్స్ గా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఏవన్నా రెండు ఘటనలు ఋజువు గా చూపిస్తూ అఫిడవిట్ ఇస్తే చాలు అని.
4.2018 లో 30% కోటా ను రద్దు చేసింది షేక్ హసీనా!
ప్రజలలో కోటా రిజర్వేషన్ మీద అసంతృప్తి పెరుగుతున్నది అని గ్రహించి.
5. కానీ రిజర్వేషన్స్ పొందుతున్నవారు హై కోర్టు లో సవాల్ చేశారు.
6.2024 జూన్ లో హై కోర్టు 30% రిజర్వేషన్స్ ను ఎప్పటిలాగే కొనసాగించాలి అని తీర్పు ఇచ్చింది. దాంతో విద్యార్థులు ఆందోళనకి దిగారు.
7. షేక్ హసీనా ఢాకా హై కోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది!
8. గత జులై నెలలో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ 30% కి బదులుగా 5% ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాని తగ్గించింది. వికలాంగులకు 1%, గిరిజనులకు, ట్రాన్స్జెండర్స్ కి 1% కోటా ను అమలు చేయాలని చెప్పింది. అంటే మొత్తం కలిపి 7% శాతం కోటా కింద పోను మిగిలిన 97 శాతం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి.
9. సుప్రీం కోర్టు తీర్పు విద్యార్థులు అడిగిన దానికి అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులు ఆందోళనకి స్వస్తి చెప్పాలి.
కానీ అలంటిదేమీ జరగలేదు!
*****************
జులై 14 న షేక్ హసీనా ఒక వ్యాఖ్య చేసింది….
‘ రిజర్వేషన్ ఫలాలు స్వాంత్రత్ర్యం కోసం పోరాడిన వారి మనవళ్ళు కి కాకుండా రజాకార్ ( ఈ పదం భారత్, పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లలో వాడుకలో ఉంది) అంటే దేశ ద్రోహుల మనవళ్ళ అనుభవిస్తారు “
ఈ వ్యాఖ్య తో మళ్ళీ విద్యార్థులు హింసాత్మక ఆందోళనకి దిగారు.
సరిగ్గా అదే సమయంలో ISI రంగంలోకి దిగింది. AI, BOT ల ద్వారా డీప్ ఫేక్ న్యూస్ ను సృష్టించి వైరల్ చేసింది!
షేక్ హసీనా కి చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు విద్యార్థుల మీద దాడులు చేస్తున్నట్లుగా ఆ రీల్స్ లో ఉన్నాయి. నిజానికి అవి పాత వీడియోలు కానీ డీప్ ఫేక్ ద్వారా నిన్నా మొన్న జరిగినట్లుగా మార్చి ఉన్నాయి. దాంతో చిన్న పెద్ద నగరాలతో పాటు పల్లెల లో కూడా హింస ప్రజ్వరిల్లింది.
ప్రభుత్వ కార్యాలయాలు, ఆవామీ లీగ్ నాయకుల ఇళ్లని టార్గెట్ చేయించింది ISI.
షేక్ హసీనా కర్ఫ్యూ విధించినా అల్లర్లు ఆగలేదు.
**********************
పరిస్థితి అదుపులోకి రాదు అని ముందే గ్రహించింది షేక్ హసీనా!
ఎందుకు?
రజాకర్ అనే పదం వాడింది అంటే అది విధ్వంస సృష్టిస్తుంది అని తెలుసు.
నిజానికి 1970 లో పాకిస్ధాన్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పౌరులు తుపాకీలతో పోరాడారు పాకిస్ధాన్ కి మద్దతుగా. అప్పట్లోనే ముజిబుర్ రెహమాన్ వాళ్ళని రాజాకార్ అని పిలిచేవాడు. కానీ పాకిస్ధాన్ పన్నాగాలు పారలేదు చివరికి పాకిస్ధాన్ తలవంచింది!
1975 లో పాకిస్ధాన్ ప్రోత్సాహంతో బంగ్లాదేశ్ లో జమాతే ఇస్లామీ పార్టీ ఆవిర్భవించింది! పూర్తిగా పాకిస్థాన్ ప్రేరేపిత మత ఛాందస పార్టీ!
జామాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ అనేది జమాతే ఇస్లామీ పాకిస్థాన్ పార్టీ నుండి వేరుపడిన పార్టీ! అజెండ ఒక్కటే! అది బంగ్లాదేశ్ ను ప్రజాస్వామ్య దేశం గా కాకుండా ఇస్లామిక్ దేశంగా మార్చాలి. అప్పుడు పాకిస్ధాన్ తో కలిసి పనిచేయవచ్చు.
కానీ పెద్దగా సక్సెస్ కాలేదు.
1978 లో ఆవిర్భవించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కి అద్యక్షుడు జియావుర్ రెహమాన్!
BNP స్టూడెంట్ విభాగం చాలా చురుకుగా ఉండేది !
మత ఛాందస పార్టీ అయిన జమాతే ఇస్లామీ BNP తో చేతులు కలిపింది అవామీ లీగ్ ను ఎదుర్కోవడానికి!
అప్పటి వరకూ జాతీయ భావాలతో ప్రజల మనసు గెలుచుకున్న BNP కాస్తా జమాతే ఇస్లామీ తో చేతులు కలిపిన తర్వాత మత ఛాందస పార్టీ గా ముద్ర పడ్డది!
*****************
గత నెల రోజులుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు BNP, జమాతే ఇస్లామీ పార్టీ తరపున విద్యార్థులతో పాటు మత ఛాందస వాదులు కలిసి చేసినవే!
2013 లో జమాతే ఇస్లామీ పార్టీ ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధం విధించింది బంగ్లా సుప్రీమ్ కోర్టు!
ఈ సంవత్సరం మొదట్లో జమాతే ఇస్లామీ పార్టీ గుర్తింపు ను రద్దు చేసింది హసీనా!
ఇక BNP కి అధ్యక్షురాలు అయిన ఖలేదా జియా జైల్లో ఉంది!
2018 లో జైల్లోకి వెళ్ళే ముందు ఖలేదా జియా లండన్ లో ఉంటూ బంగ్లాదేశ్ లో పార్టీని నడిపేది!
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం అనేది వెస్ట్ మినిస్టర్ ( Westminster) అంటే ఇంగ్లాండ్ తరహాలో ఉంటుంది.
అంటే బేగం ఖలేదా జియా లండన్ లో ఉంటూ బంగ్లాదేశ్ లో పార్టీని నడిపేది అలాగే బంగ్లాదేశ్ లో westminster తరహా పాలన ఉంటుంది!
So! క్రిస్టల్ క్లియర్! కుట్ర ఎవరు పన్నారు? ఎవరి ద్వారా అమలు చేశారు అనేది పెద్దగా ఆలోచించ అవసరము లేదు!
పైగా నెల రోజుల క్రితం ఇంగ్లండ్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది!
Contd.. part 3