Ration and Health Cards : తెలంగాణలో అర్హులకు రేషన్ కార్డులు.. ప్రజలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అర్హులు అందరికీ రేషన్ కార్డులు (Ration Cards) మరియు హెల్త్ కార్డుల (Health Cards)ను అందించేందుకు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ‘ప్రజాపాలన’ కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం (CM Revanth Reddy) తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

అంతేకాదు ఇకపై రేషన్ కార్డులకు, హెల్త్ కార్డులను ఎలాంటి లింక్ ఉండదని.. ఈ నేపథ్యంలో వేర్వేరుగా కార్డులను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కార్డులను జారీ చేసేందుకు కావాల్సిన వివరాలను సేకరించాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమం నిర్వహించాలన్న ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా హెల్త్ డిజిటల్ కార్డుల (Health Digital Cards) జారీ కోసం కూడా కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలతో పాటు సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా సాయం అందించేందుకు ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.