Orient Technologies: ఐటీ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్‎పై ఓరియంట్ టెక్నాలజీస్ స్పెషల్ ఫోకస్..!!

Orient Technologies Focus: ఐటీ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ ( IT Infrastructure) ‎పై ఓరియంట్ టెక్నాలజీస్ ప్రత్యేక దృష్టి(Special Focus) సారిస్తుందని తెలుస్తోంది.

క్లౌడ్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్‎ (Cloud infrastructure) వ్యాపారంలో గత మూడేళ్ల కాలవ్యవధిలో కంపెనీ సుమారు 250 నుంచి 300 శాతం వృద్ధిని సాధించిందని సమాచారం. కాగా ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ (IPO) ఆగస్ట్ 21వ తేదీన సబ్ స్క్రిప్షన్ కోసం తెరవబడుతుండగా 23వ తేదీన ముగుస్తుంది. కాగా ఐపీఓ ద్వారా రూ.214.76 కోట్లను సేకరించాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఓరియంట్ టెక్నాలజీస్ ( Orient Technologies) ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.195 నుంచి రూ.206 గా నిర్ణయించబడింది.

ఓరియంట్ టెక్నాలజీస్ ముంబై (Mumbai) లో వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార సాంకేతిక (IT ) సొల్యూషన్స్ ప్రొవడైర్ గా ఉంది. గత కొన్నేళ్లుగా తమ వ్యాపారంలో భాగంగా ప్రత్యేక విభాగాల ఉత్పత్తులను అందించడంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించారు.