గేమ్ చేంజర్.. పర్వాలేదంతే..

” ఐదేళ్ల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అస్తవ్యస్త, అరాచక పరిపాలనను టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ .. ఈ సినిమా. .. అని చెప్పాలి . ”

గేమ్ చేంజర్ యాక్టర్స్ :

  • రాంచరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ తదితరులు..
  • దర్శకత్వం: ఎస్ శంకర్. నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ స‌హ నిర్మాత‌: హ‌ర్షిత్. సమర్పణ: శ్రీమతి అనిత . కథ: కార్తీక్ సుబ్బరాజ్. రచనా సహకారం: ఎస్‌యు వెంక‌టేశ‌న్‌, వివేక్. సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌ తిరుణ్ణావుక్క‌ర‌సు. సంగీతం: ఎస్‌ ఎస్‌ త‌మ‌న్,. డైలాగ్స్: సాయి మాధ‌వ్ బుర్రా. లైన్ ప్రొడ్యూసర్స్: న‌ర‌సింహా రావు ఎన్, ఎస్‌ కే జ‌బీర్‌. లైన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌: అవినాష్ కొల్ల‌. కొరియోగ్రాఫ‌ర్స్‌: అన్బ‌రివు కొరియోగ్రాఫర్స్: ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ పాటలు : రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్. బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ రిలీజ్ డేట్: 10-01-2025.

ఆలిండియా సివిల్ సర్వేసులో ఎంపికై . .ఐపీఎస్ ఆఫీసర్‌ గా పనిచేస్తున్న యువకుడు . . అక్కడితో ఆగకుండా . . ఐఏఎస్ కు ప్రయత్ని0చి సక్సెస్ అవుతాడు . రామ్ నందన్ (రాంచరణ్) సొంత ఊరు వైజాగ్‌కు విధులపై వెళ్తాడు . ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)‌కు పార్టీ పరంగా, ప్రభుత్వంలో అవినీతి పరంగా కుమారులు బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జే సూర్య), రామచంద్ర (జయరామ్) నుంచి అనేక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి . సడన్ గా ముఖ్యమంత్రి తీవ్ర అనారోగ్యానికి లోనవుతాడు . కొడుకులిద్దరూ సీఎం కుర్చిపై కన్నేస్తారు . కానీ సీఎం సత్యమూర్తి మాత్రం రామ్ నందన్‌ను ముఖ్యమంత్రిగా, తన వారసుడిగా ప్రకటిస్తాడు.

రామ్ నందన్ ఐపీఎస్ సాధించినా , వదలకుండా పట్టుదలగా చదివి . . ఐఏఎస్‌ ఇలా సాధించాడు . . సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రామ్ నందన్‌ను సత్యమూర్తి సీఎంగా ఎందుకు ప్రకటించాడు?

సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోపిదేవీకి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? దీపిక (కియారా అద్వానీ)తో ప్రేమాయణానికి ఎందుకు బ్రేక్ పడింది? రామ్ నందన్ తన తల్లిదండ్రులు అప్పన్న (రాంచరణ్), పార్వతి (అంజలి)కి ఎందుకు దూరమయ్యాడు? అప్పన్నకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏ స్థాయికి చేరయి . ?? మోపిదేవీ సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి.. ఏపీని రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు? .. ఇలాంటివి ఈ కధ .

” ఐదేళ్ల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అస్తవ్యస్త, అరాచక పరిపాలనను టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ .. ఈ సినిమా. .. అని చెప్పాలి . ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పాత్రల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణ వాతావరణాన్ని కథకు ఇంధనంగా వాడుకొని.. జనరంజకమైన ప్రజా పాలనను సాగించే ఓ కలెక్టర్ కథగా తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందించిన విధానం ఆకట్టుకుంది . ఏపీలో ప్రతిపక్ష నాయకుడిని పూర్తిగా టార్గెట్ చేసుకొని అవినీతిపై సీనీ అస్త్రాన్ని సంధించే ప్రయత్నంలో దర్శకుడు శంకర్ సక్సెస్ అయినా , , ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు.. దీనిని కొనసాగించడంలో అనూహ్య విజయం సాధించలేకపోయాడనిపించింది .

సెకండాఫ్‌లో రామ్ నందన్, పార్వతి (తల్లి కొడుకులు) మధ్య సెంటిమెంట్ ఎమోషనల్‌గా చూపించినా , , మదర్ సెంటిమెంట్ సీన్లు బాగా వర్క్ అయ్యాయి. సినిమా ఆసక్తి కరంగా నడుస్తున్న టైంలో ఎన్నికల వ్యూహం . . సినిమాను పక్కదారి పట్టించింది . ఈ మూవీలో కొన్ని లాజిక్స్‌ను డైరెక్టర్ శంకర్ పెద్దగా పట్టించుకోలేదు . తెలుగు ప్రేక్షకులు ఇలాంటివి బాగా పట్టుకుంటారు . శంకర్ మాత్రం తమిళ సినిమా రీతిలో లాజిక్స్ ను వదిలేసారు .

నటీనటులు పోటీ పడి పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చారు. రామ్ నందన్‌గా, అప్పన్నగా రాంచరణ్ తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు . కలెక్టర్‌గా, ప్రజా నాయకుడిగా రెండు పాత్రల్లో అద్బుతమైన వైవిధ్యాన్ని చూపగలిగాడు . మోపిదేవీగా ఎస్‌జే సూర్య పవర్ ప్యాక్ట్ క్యారెక్టర్‌తో ఉర్రుతలూగించాడు . పార్వతి పాత్రలో అంజలి ఉత్తమ నటనను, సినిమాకు కావాల్సిన బోలెడంత ఎమోషన్‌ను ఇచ్చింది . శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేశారు.

గేమ్ చేంజర్ టెక్నీకల్ గా క్వాలిటీ గా ఉంది . తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌. గ్రాఫిక్ వర్క్ బాగుంది. గేమ్ ఛేంజర్ సినిమా ఏపీ ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే డూపర్ – సూపర్ హిట్ అయ్యేది . విషయం. కానీ మదర్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రాంచరణ్, సూర్య, అంజలి, శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్‌తో చూసి మంచి అనుభూతిని పొందాలంటే.. థియేటర్‌లోనే చూస్తే థ్రిల్ ఉంటుంది. సంక్రాంతి పండుగ సమయంలో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటింది. కామన్ ప్రేక్షకుడికి మాత్రం పెద్దగా నచ్చుతుందని చెప్పలేం .