ప్రతిపక్షాల ఆరోపణలపై ప్రధాని మోదీ రియాక్షన్..

  • అమిత్ షా బీఆర్ అంబేద్కర్ ను అవమానించారని ప్రతిపక్షాల ఆరోపణలు
  • విపక్షాల అభియోగాలపై స్పందించిన ప్రధాని మోదీ

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అభియోగాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు అన్నింటినీ ప్రజలు చూశారని మోదీ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ చేసిన అరాచకాలు, ముఖ్యంగా అంబేద్కర్ ను అవమానించిన తీరును ఇప్పుడు అబద్దాలతో దాచలేరు. అలా అనుకుంటే పొరబాటు పడినట్లే.. ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేందుకు ఒక పార్టీ చేసిన ప్రయత్నాలను దేశ ప్రజలందరూ చూశారు. మనం ఇలా ఉన్నామంటే అంబేద్కరే కారణం. దశాబ్దకాలంగా ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసింది. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశామన్న మోదీ స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడ్డాయని ట్వీట్ లో పేర్కొన్నారు.