అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడాడు. భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు అంటూ ఎమోషనల్ అవ్వడం అందరినీ బాధపెట్టింది.
దేశవాళీ క్రికెట్ ఆడొచ్చు. కానీ నా అంతర్జాతీయ కెరీర్ ఇంతటితో ముగిసింది. రోహిత్‌తో పాటు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూమ్, మైదానంలో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కెరీర్లో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, కోచ్‌లు, ఇతర ఆటగాళ్లకు ధన్యవాదాలు. నాతో కలిసి ఆడిన రోహిత్, విరాట్, అజింక్య రహానే, ఛటేశ్వర్ పూజారా తదితర ప్లేయర్లకు థ్యాంక్యూ. ఆస్ట్రేలియాలో ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా. ఇది నాకు చాలా ఎమోషనల్ డే” అని అశ్విన్ ఫెర్వేల్ స్పీచ్ ఇచ్చాడు.