రేపు టీడీపీలోకి మాజీ మంత్రి ఆళ్ల నాని

  • ఉదయం 11 గంటలకు పార్టీలో చేరిక
  • ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్లనాని

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రేపు టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఆయన తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అధికారికంగా వెల్లడించారు. అయితే ఆళ్ల నాని టీడీపీలోకి రావడం పార్టీ శ్రేణులకు ఇష్టం లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆళ్ల నాని చేరికపై హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్న ఆయన అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. అలాగే జగన్ హయాంలో పని చేసిన పలువురు మంత్రులు, ఇతర నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. కాగా రెండు నెలల కిందట వైసీపీకి ఆళ్ల నాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.