- రాష్ట్రవ్యాప్త ఒకరోజు హాస్టల్ తనిఖీ కార్యక్రమం
- గురుకుల పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనిఖీలు
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన భట్టి
- త్వరలోనే 6 వేల పోస్టులతో మెగా డీఎస్సీ
నిరుద్యోగులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆరు వేల పోస్టులతో మరో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఒకరోజు హాస్టల్ తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఖమ్మం, మధిరతో పాటు బోనకల్ లోని సంక్షేమ, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూను భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలుగా మెస్, గత 16 ఏళ్లుగా కాస్మోటిక్స్ ఛార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అయితే తాము అధికారంలోకి రాగానే పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ ఛార్జీలను 40 శాతం పెంచామన్నారు. అలాగే కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని వెల్లడించారు.