పీవీ సింధు ఎంగేజ్‎మెంట్.. ఫొటో షేర్

  • రింగ్స్ మార్చుకున్న సింధు, వెంకట దత్తసాయి
  • ఈ నెల 22న ఉదయ్ పూర్ లో పెళ్లి
  • ఇన్ స్టా వేదికగా ఫొటో షేర్ చేసిన సింధు

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నిశ్చితార్ధం చేసుకున్నారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో ఎంగేజ్‎మెంట్ జరిగింది. ఈ మేరకు రింగ్స్ మార్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను సింధు ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు తిరిగి మనమూ ప్రేమించాలి’ అనే క్యాప్షన్ తో ఫొటోను షేర్ చేశారు. అయితే సింధు వివాహం ఈ నెల 22వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుందన్న విషయం తెలిసిందే.