Actress Kasturi: ఈ సారి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు

నటి కస్తూరి మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తెలుగువారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఇబ్బందుల్లో పడింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు నటి కస్తూరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతోందనే చర్చ సాగుతోంది.

ఇలీవల సినీన‌టి క‌స్తూరి జైలుకు వెళ్లొచ్చింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఆమె ఈసారి తమిళనాడులో కీల‌క పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లుగా ఉంద‌ని చెప్పింది. అంతే కాదు కొత్తగా నటుడు విజయ్ తన పార్టీకి ఏ చిహ్నం తీసుకున్నారో తెలియదని ఎద్దేవా చేసింది. అంతేకాదు ఓ పార్టీ కూట‌మికి వ్య‌తిరేకంగా అన్నీ పార్టీలు వేర్వేరుగా పోరాడుతున్నాయ‌ని, అవ‌న్నీ ఒకే గొడుగు కిందికి రావాల‌ని క‌స్తూరి సలహాకూడా ఇచ్చింది.

ఒక కులాన్ని సమర్థిస్తూ అప్పట్లో వ్యాఖ్యలు చేసింది. తెలుగు వాళ్లందరూ తమిళనాడులో కొందరి కింద పనిచేయడానికి వలస వచ్చినవారే అంటూ మాట్లాడిన మాటలను బట్టి ఆమె ఎవరి వైపు మాట్లాడుతుందోనని తెలుగువారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఆమె బీజేపీలోకి చేరుతుందా? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా? అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

తాను జైలుకు వెళ్లిన‌ప్పుడు త‌న‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడిన వ్య‌క్తి సీమాన్ అని, అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. సీమాన్‌ కూడా ఈసారి ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని కూడా వెల్లడించింది.