వెలగపూడి సమీపంలో 5 ఎకరాల స్థలం కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నివాసి కాబోతున్నారు . ఇప్పటి వరకు ఆయన కుటుంబం హైదరాబాద్ లో నివాసం ఉంటోంది . 2014-2019 మధ్య సీయంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవారు, దీనిపై అప్పట్లో కూడా పార్టీ కేడర్ లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తేవి . అయినా చంద్రబాబు పట్టించుకునేవారు కాదు.
అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పరుచుకునే దిశగా అడుగులు పడ్డాయ్ . వెలగపూడి రెవిన్యూ పరిధిలో చంద్రబాబు ఇంటిస్థలం కొనుగోలు చేసారు . రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో స్థలం కోసం అన్వేషించిన చంద్రబాబు.. చివరికి వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు . ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్‌గా చెబుతున్నారు.. ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాట్ 25 వేల చదరపు గజాలు కాగా.. నాలుగు రోడ్ల జనక్ఖణా కి ఆనుకొని ఉంది .
చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలం అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గం కూడా దీని పక్క నుంచే వెళ్తుంది. అంతేకాదు రాజధానిలో కీలకమైన తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాల వంటి భవనాలు ఈ ప్లాట్‌కు రెండు నుంచి మూడు కిలో మీటర్ల పరిధిలోనే ఉన్నాయ్ . 5 ఎకరాల్లో ఉన్న ప్లాట్‌లో కొంత విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించి.. మిగిలిన స్థలాన్ని ఉద్యానం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాలు వినియోగించనున్నట్లు సమాచారం. ఏడాది కాలంలో ఇంటి నిర్మాణం పూర్తీ చేయనున్నారు .