ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ -డీ3 (SSLV -D3) ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట( Sriharikota) లోని షార్ నుంచి వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
ఎస్ఎస్ఎల్వీ-డీ3 (SSLV -D3) ప్రయోగం ద్వారా సుమారు 175 కిలోల ఈవోఎస్-08 (EOS -08) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కాగా మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగగా.. విపత్తు నిర్వహణ (Disaster Management) లో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం (Satellite) ఉపయోగపడనుంది. ఈ క్రమంలో పర్యావరణంతో పాటు ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది.కాగా ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్ (ఈవోఐఆర్) పేలోడ్ మిడ్ -వేవ్, లాంగ్ వేవ్ ఇన్ ఫ్రా-రెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. అయితే విపత్తు నిర్వహణలో ఈ ఉపగ్రహం అందించే సమాచారం (Information) ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది.