Telangana State: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను (Guarantees) అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ( Fress Bus for Ladies), ఉచిత కరెంట్ ( Free Current), రూ.500 కే గ్యాస్ సిలిండర్ మరియు ఇందిరమ్మ ఇళ్లు ఇలా ప్రధాన హామీలను ఒక్కొక్కటిగా అందిస్తోంది.
అయితే గృహజ్యోతి పథకం (Gruha Jyoti Scheme) కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను గవర్నమెంట్ ( Government) అందజేస్తుంది. కానీ చాలా మంది పలు అనుమానాల కారణంగా ఈ పథకానికి అప్లై చేసుకోలేదని తెలుస్తోంది. దీంతో అర్హత ఉన్నప్పటికీ వారికి ఫ్రీ కరెంట్ రాకుండా పోతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. గృహజ్యోతి పథకం కోసం మరోసారి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ( Applications) స్వీకరించాలని సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు (Orders) జారీ చేశారని సమాచారం.