పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , లోకేష్ లపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణకు హాజరుకావడంలేదు . పోలీసులను , చట్టాలను లెక్క చేయడంలేదా ? భయంతో విచారణకు డుమ్మా కొడుతున్నారా ?
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదు అయ్యింది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది. మొదటి సారి ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు ఇచ్చారు. అయితే ఈరోజు విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరుకావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్‌కు రామ గోపాల్ వర్మ సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు. అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో వర్మను పోలీసులు రెండ్రోజులలో అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది .