ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కొంతకాలంగా సోషల్ మీడియాలో మారుమోగుతున్నారు. మరో పక్క రెండేళ్ల క్రితం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ .. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల పోస్టులు పెట్టే ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. వారి మాటలపై నమ్మకంతోనే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుతో పాటు తనపైనా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తుందని ఇచ్చిన హామీని నిరూపించుకోవాలని ఆమె కోరారు.