అదానీ లంచం కేసులో పీకల్లోతులో జగన్… తప్పించుకోలేరు..

151 సీట్లతో బలంగా ఉన్నామని విర్రగేగుతూ . .. రాజకీయంగానూ , ఆర్ధికంగానూ అత్యంత బలంగా ఉన్నామని విర్రవీగుతూ 2019-2014 మధ్య ఐదేళ్ల అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదానీ లంచం కేసు నుంచి తప్పించుకునే ఛాన్స్ ఏ కోశానా లేదు. జగన్ సొంత మీడియా సాక్షి ద్వారా తనకే పాపం తెలియదని బుకాయిస్తున్న జగన్ అండ్ కో పెడబొబ్బలు అమెరికా కోర్టులు కనీస పరిగణలోకి తీసుకోవన్న విషయం సాక్షి వారికి మాత్రం తెలియదా ?

జగన్ చేసిన ఈ మహా తప్పిదం ప్రత్యర్థి , ఏపీ సీఎం చంద్రబాబుకు పాశుపతాస్త్రంగా దొరికింది . అయితే చంద్రబాబు దీనిని ఏ మేరకు, ఎంత సమర్దవంతంగా వినియోగించుకుని జగన్ కి రాజకీయ సమాధి కడతారో వేచిచూడాలి .

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పాలనలోనూ , రాజకీయంగానూ . . ఇప్పుడు మహర్దశ నడుస్తు0డి . అధికారాన్ని అడ్డంపెట్టుకుని తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు చేతికి చిక్కాడు . డబ్బు పిచ్చి అత్యధికంగా ఉన్న జగన్‌ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పేట్రేగిపోయారు . ఈ క్రమంలో సహజవనరులను అత్యంత చౌకగా దోచుకునే అలవాటున్న గౌతమ్‌ అదానీతో చేతులు కలిపారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై 25 ఏళ్లలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడేలా అదానీ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం తెర మీదకు వచ్చింది. ఇటీవల వరకు వరకు గుట్టుగా ఉన్న ఈ అతి భారీ కుంభకోణం అమెరికా చట్టాల పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబు చేతికి పాశుపతాస్త్రం దొరికినట్టయింది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతతోపాటు రాజకీయ ప్రత్యర్థి జగన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే గొప్ప అవకాశం ఈ కేసు వెలుగులోకి రావడంతో చంద్రబాబుకు లభించింది.

ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రస్తుతం. అదానీ కంపెనీ నుంచి 7000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నష్టపోతున్నది. ప్రజలపై రెండు లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. ఈ పాపానికి ఒడిగట్టింది జగన్‌రెడ్డి కాదా? ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏమిటి? సెకీ ద్వారా అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసుకొని తీరాల్సిన పరిస్థితి ఏర్పడలేదా? ప్రజలపై రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడే విధంగా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం కూడా పాపం చేసినట్టే అవుతుంది. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతున్నది? దాని పర్యవసానం అదానీ కంపెనీపై ఏ మేరకు ఉంటుందన్నది అప్రస్తుతం. అమెరికా ఏజెన్సీల రంగ ప్రవేశంతో అదానీ గ్రూపు కంపెనీలకు రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సంస్థలు ముఖం చాటేస్తాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొన్న విధంగా సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేసే స్థితి కూడా అదానీకి ఉండకపోవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరెవరికి ఏ రూపంలో లంచాలు ఇచ్చింది అజూర్‌ కంపెనీ పూసగుచ్చినట్టు అమెరికా ఏజెన్సీలకు వివరించినందున అదానీ గ్రూపు ఇందులో నుంచి బయటపడే ఛాన్స్ లేదనే చెప్పాలి .

జగన్‌ విషయానికి వస్తే… గతంలో తనపై సీబీఐ, ఈడీ సంస్థలు అవినీతి కేసులు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేసినా అవి విచారణకు నోచుకోకుండా కేంద్ర పెద్దలతో తనకున్న లోపాయికారి ఒప్పందాలతో జగన్‌ అండ్‌ కో ఇప్పుడు కూడా తప్పించుకోగలిగారన్న ఆరోపణలు ఉన్నాయ్ .

పీకల్లోతు ఇరుక్కున్న జగన్‌ ని చంద్రబాబు అంత సులువుగా విడిచిపెడతారా? అదానీ కంపెనీ నుంచి జగన్‌ మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని రుజువవుతుందో లేదో తెలియదుగానీ మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు, ట్రాన్స్‌మిషన్‌ నష్టాల రూపంలో రెండు లక్షల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడానికి పీపీఏ కుదుర్చుకున్న పాపానికి జగన్‌రెడ్డి విచారణను ఎదుర్కోక తప్పదు. తనకు అందివచ్చిన ఈ మహదావకాశాన్ని చంద్రబాబు వదులుకోకపోవచ్చు. వదులుకుంటే ఆయన రాజకీయంగా ఘోర తప్పిదం చేసినవారవుతారు. ఇదే చంద్రబాబు చేసి ఉంటే జగన్‌రెడ్డి ఇప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయించి జైలుకు పంపి ఉండేవారు. సీబీఐ కేసులలో తప్పించుకు తిరుగుతున్న జగన్‌రెడ్డిని ఈ కేసులో పకడ్బందీగా ఇరికించే అవకాశం చంద్రబాబు ప్రభుత్వానికి అందివచ్చింది. ఇంత పెద్ద కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి జగన్‌ మోహన్ రెడ్డికి దారులు మూసుకుపోయాయి. ఇప్పటి దాకా ఆయనను కాపాడుతూ వచ్చినవాళ్లు ఈ వ్యవహారంలో ఆయనను ఆదుకోకపోవచ్చు. సీబీఐ, ఈడీ కేసులలో అదానీ సహకారాన్ని కూడా జగన్‌రెడ్డి పొందుతూ వచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నపుడు జగన్ నుంచి తమ కంపెనీలకు, వారసులకు ఆర్ధిక ప్రయోజనాలను పొందారని ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ పెద్దలు ఇపుడు అమెరికా కేసు విషయంలో తలదూర్చినా కాపాడలేరు . ప్రస్తుతం జగన్ అవసరం వారికి లేదు . పైగా ఇపుడు చంద్రబాబుతో రాజకీయంగా కూటమితో కలిసి ఉన్నారు . ఈ దశలో జగన్ ని రక్షించే ప్రయత్నం చేయరని చెప్పాలి . అంటే జగన్ ఖచ్చితంగా ఇరుక్కుంట్లే కదా . ..