- సంస్థలో పని చేస్తున్న 111 ఉద్యోగుల్లో 99 మందిని తొలగించిన సీఈవో
- ఉద్యోగాన్ని సీరియస్‌గా తీసుకోలేదంటూ ఉద్యోగుల తొలగింపు
కంపెనీ ఏర్పాటు చేసే మీటింగ్ కి డుమ్మా కొడితే . . మన దేశంలో అయితే మహా అయితే వార్ని0గ్ ఇస్తారు. ఇంకా సీరియస్ గా ఉండే బాసులైతే ఇంక్రిమెంట్ కట్ చేస్తామనో, బెనిఫిట్స్ కటింగ్ అనో చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి . అమెరికాలో ఓ కంపెనీ సిఈవో మాత్రం ఏకంగా ఒకేసారి 99 మంది ఉద్యోగులను సమావేశానికి హాజరుకాలేదన్న ఒకే ఒక కారణంతో తొలగించడం హాట్ టాపిక్ .
మార్నింగ్ సమావేశానికి హాజరు కాలేదని అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో ఏకంగా 99 మంది ఉద్యోగులను తొలగించాడు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య . .. 111 మంది. ఈ ఉద్యోగాల తొలగింపునకు సంబంధించి ఓ బాధితుడు రెడ్డిట్‌లో రాసుకొచ్చాడు. ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ ఓ మ్యూజిక్ కంపెనీ.తాను సంగీత వాయిద్యాలను విక్రయించే కంపెనీలో చేరానని, చేరిన గంటలోనే తనను తొలగించారని రెడ్డిట్‌లో తొలగింపు గురించి బాధితుడు రాసుకొచ్చాడు. ఉద్యోగాన్ని సీరియస్‌గా తీసుకోలేదంటూ సీఈవో బాల్డ్విన్ ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పుకొచ్చాడు .
ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు చేయలేదని, అలాగే సమావేశాలకు హాజరు కావడంలో విఫలమయ్యారని సీఈవో చెప్పాడని తెలిపాడు. అందుకే కాంట్రాక్ట్‌ను (ఉద్యోగ అగ్రిమెంట్) రద్దు చేస్తున్నట్లు చెప్పాడన్నాడు. కంపెనీకి చెందిన వస్తువులు ఏవైనా తమ వద్ద ఉంటే వెనక్కి ఇవ్వాలని సూచించాడని, కంపెనీకి చెందిన ఖాతాల నుంచి సైన్-ఔట్ కావాలని చెప్పాడని వెల్లడించాడు.