ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అయితే ఆచరణ సాధ్యం కాని వాటిని, ఇపుడే అవసరంలేని వాటిని తెరపైకి తెచ్చి అభాసుపాలవుతున్న అంశాన్ని విస్మరిస్తున్నారు .
వందల ఎకరాల భూములు సేకరించి విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే . .. అవి ఎంతమందికి ప్రయోజనకరం అవుతాయి ? విమానయన సంస్థలు ఆయా ఎయిర్ పోర్టుల నుంచి విమానాలు నడపడానికి ముందుకు వస్తాయా ? వాటికి కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా ? అనేదానిపై ప్రాధమిక సమాచారం తెప్పించుకున్నా అవసరం లేదని సమాధానం వస్తుంది . పైగా వాటి నిర్వహణ భారమై . ..మధ్యలో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది . అలాంటి పరిస్థితి తలెత్తితే ఈ ఏర్పాటు చేసిన వారిని జనం తిట్టిపోస్తారు . ..
ఎన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నా , , ఇలాంటివి తెరపైకి తేవడం వల్ల అభాసుపాలవడం ఖాయం . .
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేల విడిచి సాము చేస్తున్నట్లు అనిపిస్తోంది . కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా ఆరు ఎయిర్ పోర్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఏడు (విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి , రాజమండ్రి, కడప, కర్నూల్ , పుట్టపర్తి) ఎయిర్ పోర్టులు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా మరో ఆరింటిని ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది.
కుప్పం , నాగార్జున సాగర్, ఒంగోలు , తాడేపల్లిగూడెం, అన్నవరం – తుని, శ్రీకాకుళంలలో ఎయిర్ పోర్టులను నిర్మించాలని తలపెట్టింది ఏపీ సర్కార్ . సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రూ 1.92 కోట్లు కేటాయించారు.
శ్రీకాకుళానికి విశాఖ సమీపంలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ …54 కిలోమీటర్ల దూరం. శ్రీకాకుళమ్మ్, విజయనగరం వాసులలో ఎంత మేరకు విమాన యానాం చేస్తున్నారు . . ఎయిర్ పోర్ట్ అవసరం ఎంత వరకు ఉంది ? అనే ప్రాధమిక పరిశీలనా లేకుండానే దీని గురించి కూడా ప్రతిపాదనలు తయారు చేయడానికి సొమ్ము కేటాయించడం కరెక్ట్ కాదు . తుని – అన్నవరం లో నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్ట్ కి విశాఖపట్నం 98 కిలోమీటర్లు . రాజమండ్రి నుంచి అన్నవరం 80 కిలో మీటర్లు . తుని ఏరియా నుంచి విమాన యానాన్నికి రాజమండ్రి , అటు విశాఖ అందుబాటులో ఉండగా . .. తుని , అన్నవరం ప్రాంతాలలో ఎయిర్పోర్ట్ అవసరం ప్రస్తుతం లేదనే చెప్పాలి .
కుప్పం నుంచి బెంగుళూరు 120 కిలో మీటర్లు. కుప్పం నుంచి తిరుపతి ఎయిర్ పోర్ట్ 180 కిలో మీటర్లు .
తాడేపల్లిగూడెం అటు విజయవాడ , ఇటు రాజమండ్రికి మధ్యలో ఉంది . రాజమండ్రి ఎయిర్ పార్టీకి 56 కిలో మీటర్ల దూరం . అలాగే టిపి గూడెం నుంచి 96 కిలో మీటర్ల దూరం ఉంది . ఇక్కడ కూడా ఇపుడపుడే ఎయిర్ పోర్ట్ ఆవసారం ఉండదు .
ఒంగోలు నుంచి తిరుపతి ఎయిర్ పోర్ట్ 260 కిలో మీటర్లు ఉంది . కర్నూలు ఎయిర్ పోర్ట్ 260 కిలో మీటర్ల దూరం ఉంది . కడప ఎయిర్ పోర్ట్ ఒంగోలు కు 230 కిలో మీటర్ల దూరంలో ఉంది. విజయవాడ ఎయిర్ పోర్ట్ ఒంగోలు కు 170 కిలో మీటర్ల దూరంలో ఉంది.
రాష్ట్ర ప్రభుత్యం ప్రతిపాదిస్తున్న వాటిలో ఒంగోలు పరిసర వాసులకు ఎయిర్ పోర్ట్ 150 కిలో మీటర్ల లోపు ఎక్కడ లేదు . అయితే . .. ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలలో విమానయానం చేస్తున్న వారి సంఖ్య ఎంత ? అనే దానిపై స్పష్టత తీసుకుంటే . .. అక్కడ కూడా ఇప్పట్లో ఎయిర్ పోర్ట్ అవసరం ఉండకపోవచ్చు .