”ఈనాడు నుంచి మంచి పొజిషన్ వదులుకుని వచ్చాను. పత్రిక అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రణాళికతో పనిచేసాను . టీమ్ తో సమర్ధవంతంగా చేయించాను . చేయిస్తున్నాను. ఇరవై ఏళ్ల నుంచీ నిబద్దతతో , నిజాయితీగా పనిచేస్తున్న నన్ను పక్కన పెట్టి ఇటీవల వచ్చి చేరిన అతనికి ఎడిటర్ పోస్ట్ ఇచ్చేస్తారా? ఇది మీకు నైతికత అనిపిస్తోందా.” అంటూ మదనపడుతున్నారట ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ.
అక్టోబర్ 19 ”ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎందుకు వెళ్లిపోతున్నారు ‘ ‘ అనే శీర్షికన అభిన్యూస్ లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో వక్కలంక రమణ నిజాయితీపరుడే కానీ, జర్నలిజంలో సబ్జెక్ట్ లేనివాళ్ళని , చెడ్డ వాళ్ళని ప్రోత్సహించడం అతని కెరీర్ కి చేటు చేసిందని , ఈ కారణంగా ఎడిటర్ పోస్ట్ దక్కడంలేదని … ఎడిటర్ గా రాహుల్ ని నియమిస్తున్నారని .. ఆంధ్రజ్యోతి మేనేజ్ మెంట్ ప్రకటించకుండానే అభిన్యూస్ పబ్లిష్ చేసింది .
ఈ నెల 1 నుంచి నాదెళ్ల రాహుల్ కుమార్ ని ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా నియమించారు . దీంతో అప్పటి వరకు ఈ పోస్టుపై ఏళ్ల తరబడి ఆశలు పెట్టుకున్న అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ తీవ్ర మనోవేదనకు గురయ్యారని సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు బాహాటంగా చెప్పుకుంటున్నారు.
రమణతో పాటు ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసిన తిగుళ్ల కృష్ణ మూర్తి నాలుగేళ్ల క్రితమే నమస్తే తెలంగాణ పత్రికకు ఎడిటర్ గా వెళ్లారు. ఇలా రమణ కొలీగ్స్ లో మరికొందరు ఎడిటర్లు అయ్యారు. కె శ్రీనివాస్ తరువాత తానే ఎడిటర్ అవుతానని ఇన్నాళ్లు రమణ పెట్టుకున్న భ్రమలపై రాధాకృష్ణ నీళ్లు చల్లారు.
ఆర్కేని దెబ్బకొట్టిన రమణ సలహాలు: 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వ్యం అధికారంలో ఉన్నపుడు . .. టీడీపీని , బీజేపీకి దూరం చేయడంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు రమణ ఇచ్చిన సలహాలే కీలకం అని చెప్పాలి . అప్పటికే రమణ అంటే రాధాకృష్ణకు ఎనలేని అభిమానం . బీజేపీ అంటే సహజంగానే ఆర్కే కి కూడా కడుపు మంట . ఆర్కే చెవిలో గూడుకట్టుకుని . . అవకాశం దక్కినపుడల్లా . .. బీజేపీ గురించి రమణ నెగిటివ్ ఎక్కించేవారట. కమలం పార్టీపై ఆర్కే తీవ్ర వ్యతిరేఖంగా తన కొత్తపలుకులో రాయడం , , అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి బీజేపీ నుంచి బయటకు రావాలని పదే పదే చెప్పడం.. అప్పటికే ఆర్కే మహా మేధావి అన్న భ్రమలో ఉన్న చంద్రబాబు సైతం బీజేపీతో తెగతెంపులు చేసుకోవడమ్,, 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వెనుక చేరడం , , పశ్చిమబెంగాల్ , ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారాలలో మోడీపై నిప్పులు చేరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి . దీనికి ప్రధాన భూమికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దే అన్న విషయం అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. 2019 ఎన్నికలలో మోడీని, బీజేపీని వ్యతిరేకించి చావు దెబ్బ తిన్న చంద్రబాబు . ..2024 ఎన్నికల నాటికి ఆర్కే మాయ నుంచి బయట పడ్డారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వల్లే ఇదంతా జరిగింది . ..అని చంద్రబాబుతో పాటు , కొద్దిమంది టీడీపీ ముక్యులకు కూడా తెలుసు. ఈ వ్యవహారాలతో పాటు .. రాధాకృష్ణ బిహేవియర్ కూడా ఇటీవల టీడీపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఆంధ్రజ్యోతి – ఏబిఏన్ రాధాకృష్ణను పక్కన పెట్టినట్లు మీడియా, పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
కూటమి ప్రభుత్వ్యం వచ్చిన నెల , రెండు నెలలకు ఆంధ్రజ్యోతి జిల్లాలలో ప్రక్షాళన చేయాలన్న సంకల్పంతో ఆర్కే … అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణను వెంటపెట్టుకుని ప్రత్యేక విమానంలో తిప్పారు . ఆంధ్రజ్యోతికి కాబోయే ఎడిటర్ రమణ . . అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది . రమణ కూడా తనకి ఎడిటర్ పోస్టు వస్తుందన్న ఆత్మవిశ్వాసంతో కనిపించారు .
ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ లో గ్రూపుల వైరం:ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ అంటేనే వక్కలంక రమణ . రమణ నియమించిన వారే అందులో కీలకమైన పోస్టులలో ఉంటారు . అలాగే జిల్లాలలో ఉండే ఎడిషన్ ఇంచార్ట్ లలో మెజార్టీ సైతం రమణ చెప్పుచేతలలోనే ఉంటారు. జర్నలిజంలో నిష్ఠతులు కాకపోయినా రమణ ప్రాపకం ఉంటే ఆంధ్రజ్యోతిలో జాబ్ కి ఢోకా ఉండదన్న నానుడి ఉంది. కె రామచంద్రమూర్తి ఎడిటర్ గా ఉన్నప్పటి నుంచీ , కె శ్రీనివాస్ ఎడిటర్ గా చేసిన . . ఈ ఇరవై ఏళ్ల కాలంలో రమణ హవా కొనసాగిందని చెప్పాలి. తాజాగా నాదెళ్ల రాహుల్ కుమార్ ఎడిటర్ గా నియమితులయ్యారు. ఇది జరిగి వారం రోజులు కాకముందే ఇప్పటి వరకు రమణ వర్గంగా ముద్ర వేసుకున్న సబ్ ఎడిటర్స్, ఇతర సిబ్బందిలో మెజార్టీ జెండా మార్చేశారట. రెండు దశాబ్దాల పాటు హవా కొనసాగించిన రమణకు ఈ పరిణామాలు మింగుడుపడటంలేదు . అయితే రెండు రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. ఎడిటర్ పోస్ట్ ఇవ్వకుండా తనను అవమానించినందుకు ఆంధ్రజ్యోతికి రమణ గుడ్ బై చెపుతారా ? రాహుల్ కుమార్ అండర్ లో పనిచేస్తారా ? అనే ఉత్కంఠతో ఉన్నామంటున్నారు ఆంద్రజ్యోతి సెంట్రల్ డెస్క్ టీమ్ . ఏం జరుగుతుందోనంటూ హైదరాబాద్ మీడియా సర్కిల్స్ లో కూడా ఆసక్తి నెలకొంది .
తెలుగు సమాజానికి ఆంధ్రజ్యోతి పత్రిక , ఏబీఎన్ ఛానల్ ద్వారా నీతులు భోదించే వేమూరి రాధాకృష్ణ తన సంస్థలో జరుగుతున్న గ్రూపుల వైరాన్ని నిలువరించగలరా ? పట్టించుకోకుండా ఉంటే అవే సర్దుకుపోతాయని వదిలేస్తారా ? అంటూ జర్నలిస్ట్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది .