ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కు భారీ షాక్ ఇచ్చారు ఆ దేశ ప్రజలు. అమెరికా నుంచి వెలువడే ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్. అయితే అమెరికా అధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ ఆమోదాన్ని నిరోధించాలని ఆ పత్రిక నిర్ణయం తీసుకుంది. అంతే ఈ నిర్ణయం వెలువరించిన వెంటే సోమవారం మధ్యాహ్నం నాటికి 2లక్షలకు పైగా ప్రజలు తమ డిజిటల్ సభ్యత్వాలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని అక్కడి నేషనల్ పబ్లిక్ రేడియో వెల్లడించింది
అలాగే పలువురు కాలమిస్టులు వాషింగ్టన్ పోస్ట్‌కు రాజీనామా చేసినట్లు ఎన్‌పీఆర్ నివేదించింది. అయితే, ఈ నివేదికపై స్పందన కోసం రాయిటర్స్ చేసిన అభ్యర్థనకు వాషింగ్టన్ పోస్ట్ నిరాకరించింది. శుక్రవారం ఒక పోస్ట్‌లో వార్తాపత్రిక పబ్లిషర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విలియం లూయిస్ నవంబర్ 5 ఎన్నికలలో లేదా భవిష్యత్ లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్ష అభ్యర్థికి తాము ఆమోదం తెలియజేయబోమని పేర్కొన్నారు. “మేము అధ్యక్ష అభ్యర్థులను ఆమోదించని మా మునుపటి నిర్ణయానికి తిరిగి వస్తున్నాం” అని లూయిస్ ఆ పోస్టులో రాసుకొచ్చారు.