అందంగా , ప్రకాశవంతంగా కనిపించే.. ఆరోగ్యకరమైన చర్మం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు..?
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం అనిపించదు . అట్ట్రాక్టివ్ గా ఉందాలంటే ముందు చర్మ సౌందర్యం కీలకం అంటారు కొందరు . తమ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా, మృదువుగా ఉంచడానికి ఎన్నో కాస్మోటిక్ ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయితే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో అనేక రసాయనాలు ఉన్నాయని, అవి చర్మానికి హాని కలిగిస్తాయని అందరికీ తెలిసిందే. అలాంటి బ్యూటీ ఉత్పత్తులకు బదులు ఆయుర్వేదం చెప్పిన క్రీమ్‌ను తయారు చేసుకుని వాడితే మంచిది. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం ఆయుర్వేదం నెయ్యితో తయారు చేసిన ‘శతదౌత్ ఘృత’ అనే క్రీమ్ గురించి చెబుతోంది. ఈ క్రీమ్‌ను ఇంట్లోనే తయారుచేసి వాడుకోవచ్చు.
శతదోత్ ఘృత అంటే
శత అంటే వంద, ధౌత్ అంటే శుభ్రం చేయడం, ఘృత అంటే ”నెయ్యి ‘ ‘ . శతదౌత్ ఘృత అంటే 100 సార్లు నెయ్యితో శుభ్రపరచడం అని అర్ధం . పేరుకు తగ్గట్టుగానే ‘శతదోత్ ఘృత’ తయారీలో, ఆయుర్వేద పద్దతిలో దీనికి అనేక ఔషధాలు కూడా కలుపుతారు. ఇది చర్మానికి సంబంధించిన అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది .
క్రీమ్ తయారీ ఇలా
‘శతదోత్ ఘృత్’ అనే క్రీమ్ ని సొంతంగా తయారు చేయడానికి, 50 గ్రాముల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 100 మిల్లీలీటర్ల నీరు అవసరం. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో నీటిని చిన్న మంట మీద మరిగిస్తూ స్పూనుతో కలుపుతూనే ఉండాలి. ఇలా నీటిని పదేపదే కలపడం వల్ల, చివరికి వెన్న వంటి తెల్లని పేస్టు మాదిరి తయారవుతుంది . ఈ క్రీమ్ ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా,, ప్రకాశవంతంగా కనిపిస్తుంది . ఈ క్రీమ్ రాయడం వల్ల పలు చర్మ రోగాలు కూడా దూరమవుతాయి . ఈ క్రీమును రెండు వారాల పాటు మాత్రమే నిల్వ ఉంచాలి. ఆ తర్వాత కొత్త క్రీమ్ తయారు చేసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా, స్మూత్ గా ఉండాలంటే ఈ క్రీమ్ ను చర్మంపై అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.