షర్మిల , విజయమ్మపై జగన్ పిటిషన్.. ఆస్తుల తగాదాయేనా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల తగాదా తారాస్థాయికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది .  వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం  వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని విశ్వసనీయ  సమాచారం. తాజాగా జగన్​ కోర్టును ఆశ్రయించడమే దీనికి  కారణమని తెలుస్తోంది. ఈ మేరకు చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై హైదరాబాద్​లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్‌ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని జగన్‌, ఆయన భార్య భారతి రెడ్డిలు పిటిషన్ లు వేశారు .

వారిద్దరి షేర్స్ క్యాన్సిల్ చేయండి : ల జగన్, భారతి పిటిషన్ 

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్​ లిమిటెడ్‌లో వైఎస్ జగన్‌కు షేర్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్​ ను ఆశ్రయించినట్లు చెపుతున్నారు .    సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని వారు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది .ఈ పిటిషన్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. వైఎస్ జగన్ తరఫున వై.సూర్యనారాయణ సెప్టెంబర్ 10న ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని క్లాట్ విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.  అయితే ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తాజాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

కేసు నెంబర్లు ఇవే..ఈ ఏడాది సెప్టెంబర్3వ తేదీన  వేసిన   కేసు నెంబర్ CP- 48/2024 కాగా, సెప్టెంబర్ 11వ తేదీన IA (కంపెనీస్ యాక్ట్)-268/2024, IA (కంపెనీస్ యాక్ట్)-266/2024, IA (కంపెనీస్ యాక్ట్)-267/2024 కేసు నెంబర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 18న IA (కంపెనీస్ యాక్ట్)-319/2024 కేసు నెంబర్‌తో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్3వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెస్పాండెట్లకు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురి కోరం నోటీసులను జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్8వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది వై సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది .