Tecno POVA 6 NEO: భారీ డిస్కౌంట్‌.. రూ. 12 వేలలో కళ్లు అద్బుతమైన ఫీచర్లు

టెక్నాలజీ అధికమవుతోంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్ బయటకు వస్తోంది. అలా వచ్చిన మరో నయా సెల్ ఫోన్ టెక్నో పోవా 6 నియో. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 29వ తేదీతో ముగియనున్న ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు.  టెక్నో కంపెనీకి చెందిన టెక్నో పోవా 6 నియో 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో మంచి డీల్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 16,999గా ఉంది. అయితే అమెజాన్‌ సేల్‌లో భాగంగా 18 శాతం డిస్కౌంట్‌తో రూ. 13,999కి లభిస్తోంది. ఇక ప్రత్యేకంగా ఈ ఫోన్‌పై రూ. 1000 కూపన్‌ను అందిస్తోంది. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. వెయ్యి డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 12వేలకే సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 13 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. కెమెరా విషయానికొస్తే టెక్నో పోవా నియో 5జీలో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. డీ6300 వంటి పవర్‌ ఫుల్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఇన్‌ఫ్రారెడ్‌, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చార. అలాగే ఏఐ ఎరెజర్‌, ఏఐ కట్‌ అవుట్‌, ఏఐ వాల్‌ పేపర్‌, ఆస్క్‌ ఏఐ వంటి అధునాతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్స్‌ను ఇందులో ఇచ్చారు. ఐపీ54 రేటింగ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డాల్బీ ఆట్స్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ను ఇచ్చారు. తక్కువ ధరలో లాంటి బెస్ట్‌ ఫీచర్స్‌ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.