సత్యకుమార్ పై హత్యాయత్నం . . గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

రాజధాని అమరావతి దీక్షకు మద్దతు ప్రకటించడానికి వెళ్లిన సత్యకుమార్ యాదవ్ పై అప్పటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ,  రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ మనుషులు దాడి చేసి హత్యాయత్నం చేసారని బీజెవైఎం నేత కొణతల సురేష్ …మంగళవారం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేసారు .

అమరావతి రాజధాని రైతు ఉద్యమానికి మద్దతు తెలిపి వెనక్కి వెళుతున్న సమయంలో 2023 మార్చి 31 వ తేదీన  బోరుగడ్డ అనిల్ అనుచరులు, నందిగం సురేష్ అనుచరులు కత్తులు ,  రాడ్లు ,  ఇతర మారణాయుధాలతో సత్యకుమార్ యాదవ్ పైకి చంపడానికి వచ్చారన్నారు .  అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు నమోదు చేయలేదని తెలిపారు .  బాద్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఫిర్యాదు దారు సురేష్ తెలిపారు . సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం  కూటమి ప్రభుత్వ్యంలో వైద్య ,  ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు .