Target: లోకేష్ టార్గెట్ లక్ష కోట్లు ….?

ఔను . . లోకేష్ టార్గెట్ లక్ష కోట్లు .  మీరు విన్నది నిజమే … తాను నిర్వహించే శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఉద్యోగ ,  ఉపాధి అవకాశాల కల్పనకు తీసుకురావాలనుకుంటున్న పెట్టుబడులు .

    స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీకి ప్రఖ్యాత కంపెనీలను స్వాగతించాలన్నది లోకేష్ సంకల్పం. 

యువగళం పాదయాత్రలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఏపీ ఐటి ,  ఎలక్ట్రానిక్స్ ,  మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేసారు .  ఇందులో భాగంగా విశాఖపట్నం ,  అమరావతి ,  తిరుపతి నగరాలకు  పెద్ద ఎత్తున ఐటి  (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కంపెనీలను తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు . విశాఖలో రెండు దఫాలుగా ఐటీ కంపెనీలతో సమావేశమైన లోకేష్ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నారు .   ఇందులో భాగంగా ఫస్ట్ పేజ్ లో విశాఖలో ప్రముఖ దేశీయ సంస్థ టిసిఎస్ (టాటా కమ్యూనికేషన్ సర్వీసెస్ ) ను తీసుకురావడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు . TCS ద్వారా విశాఖలో ఏర్పాటు చేయబోయే కంపెనీలో మొదటి దశగా 10 వేల ఉద్యోగాలు రానున్నాయి .    2019-2024 ,,,జగన్ సీఎంగా ఉన్నపుడు విశాఖ ,  అమరావతి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి తరలిపోయిన ఐటీ కంపెనీలను తిరిగి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ .

HCL విస్తరణ సన్నాహాలు :  2014-2019 టీడీపీ అధికారంలో ఉన్నపుడు it శాఖ మంత్రి లోకేష్ చొరవతో విజయవాడ సమీపంలో గన్నవరంలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్ సిఎల్ .  సంస్థ 4,500 ఉద్యోగాలు కల్పించింది .  ఇపుడు సదరు సంస్థ పేజ్ – 2లో మరో 5 వేల ఉద్యోగాల కల్పనకు సిద్ధమవుతోంది .

అమెరికా పయనం: ఈ నెల   25 నుంచి నవంబర్ 1 వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు .  ఇందులో భాగంగా . . అక్టోబర్ ,29, 30  తేదీలలో శాన్ ఫ్రాన్స్ స్ కో లో జరగనున్న  9వ వార్షిక ఐటి సర్వ్  సినర్జీ సదస్సులో  లోకేష్ పాల్గొననున్నారు .  ఈ సదస్సు ద్వారా పలు అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కంపెనీల సిఈవో లతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించాలని  ఆహ్వానించనున్నారు .

హైటెక్ సిటీ మోడల్ ఏపీలోనూ .  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీని దశల వారీగా అభివృద్ధి చేసిన మోడల్ ను ఏపీలో చేపట్టాలని లోకేష్ ఇప్పటికే ప్లాన్ చేసారు .  ఇందులో భాగంగా విశాఖపట్నం ,  తిరుపతి ,  అమరావతి ఏరియాలలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు .  2024-2029 మధ్య కాలంలోనే తన లక్ష్యం చేరుకోవాలని లోకేష్ సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు .  ఈ ఐదేళ్ల పాలనలో ఐటీ ,  ఎలక్ట్రానిక్స్ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు తేవాలన్నది లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది .

కంపెనీలకు భరోసా ఇవ్వగలరా ?  2014-2019 మధ్య విశాఖ ,  విజయవాడ ,  తిరుపతి నగరాలలో ఏర్పాటు చేసిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు . . 2019-2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నపుడు తరలిపోయాయి .  కొన్ని చోట్ల రాజకీయ ఇబ్బందులు.. రాయితీలు అందక  ఇంకొన్ని కంపెనీలు . .  ఆంధ్రప్రదేశ్ నుంచి దుకాణం కట్టేశాయ్ .  ఇపుడు మళ్ళీ ఆ కంపెనీలు తిరిగి రావడానికి సందేహాలు వ్యక్తం చేస్తున్నాయ్ .  గత పరిణామాలు ,   రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ”ఏపీలో కంపెనీ పెడితే ఎంత సేఫ్ ‘ ‘ అన్న అనుమానాలతో ఉన్న ప్రముఖ కంపెనీలకు లోకేష్ ఇచ్చే భరోసా ఎంతవరకు సఫలీకృతం అవుతుంది. ఈ ఐదేళ్లు కూటమి అధికారంలో ఉన్నన్నాళ్లు సమస్య ఉండకపోవచ్చు . . తర్వాత గవర్నమెంట్ మారితే . . వాళ్ళ విధానాలు ,  పొలిటికల్ డెసిషన్స్ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవని భరోసా ఇవ్వగలరా ?  అంటూ పలు కంపెనీల సిఈవోలు అడుగుతున్న ప్రశ్నలకు లోకేష్ చెప్పే సమాధానాలే కాదు . . ఇచ్చే భరోసా ఏమిటి ?  కూటమి నేతలు చంద్రబాబు ,  పవన్ ,  లోకేష్ లను నమ్మి ప్రముఖ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తాయా ?  ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా కనిపిస్తున్నాయ్ .