Raithu Bharosa Funds: తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government) శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల ( Six Guarantees) ను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం రుణమాఫీపై ప్రత్యేక దృష్టి (Special Focus) పెట్టింది.
ఆగస్ట్ 15వ తేదీ నాటికి రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా రెండు విడత ( Two Phases) ల్లో రూ. లక్ష, రూ.లక్షన్నర వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ తరహాలోనే 15 నాటికి మూడో విడత కూడా పూర్తి చేస్తామని తెలిపింది. అనంతరం రైతు భరోసా ( Raithu Bharosa) కింద ఆర్థిక సాయం అందించనుందని సమాచారం.
రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం ( Financial Support) అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిందన్న సంగతి తెలిసిందే. అంతేకాదు రైతు భరోసా పథకాన్ని ఒకే దశలో అమలు చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ లోనే రైతు భరోసా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరత కారణంగా ప్రభుత్వం రైతుబంధును మాత్రమే అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ సైతం అయిపోయే పరిస్థితుల నేపథ్యంలో నగదును ఒకేసారి రైతులకు అందించాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన (Official announcement) రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా అసంతృప్తితో ఉండగా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందో వేచి చూడాల్సిందే.