రేపు విచారణకు హాజరుకావాల్సిందే – సజ్జలకు నోటీసులు

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు వైసీపీ నేతలను వెంటాడుతోంది .   వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు .    గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే చైతన్య అనే వైసీపీ నేతను అరెస్ట్ చేసారు .  ఆ పార్టీ కీలక నేతలు లేళ్ల అప్పిరెడ్డి ,  దేవినేని అవినాష్ లకు కూడా ఇదివరకే టీడీపీ కార్యాలయ దాడి కేసులో నోటీసులు జారీ చేసారు .  టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ప్రమేయం కూడా ఉందని గుర్తించిన పోలీసులు ఆయన దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో నిన్న ఆయనను ఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ  సజ్జలకు తాజాగా నోటీసులు జారీచేశారు.