Bangladeshi Origins: ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఉద్రిక్తత.. 34 మంది వ్యక్తుల గుర్తింపు

Bangladeshi Origins: ఒడిశా రాష్ట్రంలోని సంబల్ పూర్ జిల్లా (Sambalpur District) లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి కొందరు పౌరులు మధ్య భారతదేశంలోకి చొరబడ్డారని ఆరోపిస్తూ బీజేపీ యువజన విభాగం ( BJP Youth Wing) మరియు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు (Bharatiya Janatha Yuva Morcha Leaders) 34 మందిని పట్టుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

అయితే వారంతా బంగ్లాదేశ్ కు చెందిన వారు కాదని ధృవీకరించిన పోలీసులు వారిని విడిచి పెట్టినట్లు తెలిపారు. ఈ 34 మంది వ్యక్తులు పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని ముర్షిదాబాద్ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. పశ్చిమ ఒడిశా పట్టణంలోని బుధరాజా ప్రాంతంలోని ఓ నిర్మాణ స్థలంలో గత కొన్ని నెలలుగా కార్మికులుగా (Workers) పని చేస్తున్నారని ఐంతపాలి పోలీసులు (Aitanpali Polices) వెల్లడించారు.
ఇక మరోవైపు భద్రక్ జిల్లాలోని బసుదేవ్ పూర్ ప్రాంతంలోనూ ఇదే తరహాలో ఏడుగురిని స్థానికులు పట్టుకున్నారు. సదరు వ్యక్తులు చొరబాటుదారులుగా అనుమానిస్తున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. కాగా దీనిపై స్పందించిన పోలీసులు వారి గుర్తింపును ధృవీకరిస్తున్నామని (Identity Verify) తెలిపారు.