బాలీవుడ్ బుల్లితెర నటి హినా ఖాన్ కొన్నాళ్లుగా రొమ్ము క్యాన్సర్ స్టేజ్ 3తో (Hina Khan Breast Cancer) పోరాడుతున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఇదివరకే కిమోథేరపీ చికిత్స కారణంగా ఆమె జుట్టును కూడా కోల్పోయింది. ఇక ఇప్పుడు తన కనుబొమ్మలను కూడా కోల్పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది హినా ఖాన్. క్యాన్సర్తో పోరాడుతున్న హినా ఇప్పుడు హృదయ విదారక ఫోటోను పంచుకుంది. అదే తన కంటిలో మిగిలి ఉన్న చివరి కనురెప్పల చిత్రం..
ప్రస్తుతం తనకు ఈ కనురెప్పే అతిపెద్ద ప్రేరణ అని చెబుతోంది. “నా ప్రస్తుత మోటివేషన్ కారణం ఏమిటో మీకు తెలుసా? నా కనురేప్పే. ఒకప్పుడు నా కళ్లకు కట్టిన శక్తివంతమైన, అందమైన సైన్యంలో భాగం నా కనురెప్పలు. నా వెంట్రుకలు సహజంగా పొడవుగా, అందంగా ఉన్నాయి. ఇప్పుడు నాతో పాటు క్యాన్సర్తో పోరాడుతూ నా కనురెప్పలు ఒంటరిగా ఉన్నాయి. నా చివరి కీమోథెరపీ చికిత్సలో భాగంగా నా కనురెప్పలు రాలిపోయాయి. నా వెంట్రుకలన్నీ రాలిపోయినప్పటికీ ఈ ఒక్క కనురెప్ప నాకు స్ఫూర్తినిస్తుంది. అంతా బాగానే ఉంటుంది, పదేళ్లుగా తప్పుడు కనురెప్పలు వేసుకున్న నేను వాటన్నింటిని ఎదుర్కొనే శక్తి నాకు కలగాలి. కానీ ఇప్పుడు నేను షూట్ కోసం కనురెప్పలు ధరించవలసి వచ్చింది” అంటూ హినా ఖాన్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం హినా ఖాన్ షేర్ చేసిన ఈ పోస్టుపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. హీన ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.