ఏపీ పోలీసుల దర్యాప్తులో ఉన్న మూడు ప్రధాన కేసులను సీఐడీ చేతికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలతో పాటు.. సంచలనం సృష్టించిన సినీనటి కాదంబరీ జెత్వానీ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు. ఈ 3 కేసులనూ ఇప్పటివరకు స్థానిక పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీ ఆదేశాలతో కేసులకు సంబంధించిన రికార్డులన్నింటినీ సీఐడీకి అప్పగించనున్నారు.