రామ్‌చరణ్ కొత్తమూవీ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుదల చేయన్నారని దిల్‌రాజు స్పష్టతనిచ్చారు.
మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని దిల్ రాజు చెప్పారు. సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిని, యువీ సంస్థను అడిగితే సానుకూలంగా స్పందించారన్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. త్వరలోనే టీజర్ విడుదల కానుంది. ఆ తర్వాత మరో మూడు పాటలను రిలీజ్ చేస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.