అమెరికాలో ఎన్నికల ప్రచార పోరు సాగుతోంది. అయితే డోనాల్డ్ ట్రంప్ తో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కలిసి ప్రచారంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. తనపై కాల్పుల జరిగిన మాథ్యూ బ్రూక్స్‌ను రాక్షసుడుగా ట్రంప్ అభివర్ణించారు. 12 వారాల క్రితం ఒక హంతకుడు నన్ను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ నన్ను ఎవరూ ఆపలేరు అని వ్యాఖ్యానించారు. అయితే బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను వేదికపైకి ట్రంప్ ఆహ్వానించి మస్క్ ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.
మస్క్ ప్రశంసల జల్లు
పెన్సిల్వేనియాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై ఎలాన్ మస్క్ ప్రశంసల జల్లు కురిపించారు. ఒక అధ్యక్షుడు (జో బిడెన్) మెట్లు ఎక్కలేకపోతున్నారు. మరొకరు తుపాకీతో కాల్చిన తర్వాత కూడా పిడికిలి పైకెత్తారని మస్క్ అన్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ట్రంప్ పరిరక్షించాలంటే ఆయన తప్పక గెలవాలని, అమెరికన్ల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ఎన్నికలు ఇవని చెప్పారు. అందరినీ ట్రంప్‌కు ఓటు వేయమని కోరండి అని మస్క్ కోరారు.