Supreme Court: కోల్‎కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ..

Supreme Court: కోల్‎కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ( RG Kar Medical College) లో చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఆగస్ట్ 20న విచారణ చేపట్టనుంది.

మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశం అంతటా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా సీబీఐ విచారణ (CBI Investigation) కూడా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్ ను సీబీఐ అధికారులు వరుసగా నాలుగో రోజు (Fourth Day) విచారిస్తున్నారు. ఇక నిందితుడు సంజయ్ రాయ్ కి సైకలాజికల్ బిహేవియర్ అనాలసిస్ టెస్ట్ (Psychological Behavior Analysis Test) ముగిసింది. కాగా ఈ కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.