Mohammed Shami Re-Entry: క్రికెట్ అభిమానులకు శుభవార్త (Good News). టీమిండియా స్టార్ పేసర్ (Team India Star Pacer) మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నిజానికి దులీప్ ట్రోఫీలోనే ఆడతాడని భావించినప్పటికీ గాయం ఇంకా మానకపోవడంతో రీ ఎంట్రీ ( Re-Entry) ఆలస్యం అవుతోంది.
చీలమండకు గాయం కావడం, శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) ఫైనల్ జరిగినప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు షమీ దూరంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు (Bangalore) లోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న ఆయన నవంబర్ లో ప్రారంభం అయ్యే ఆస్ట్రేలియా సిరీస్ (Australia series) సమయానికి పూర్తి ఫిట్ నెస్ సాధించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు గానూ రంజీ ట్రోఫీలో ఆడాలని షమీ నిర్ణయించుకున్నారని సమాచారం. రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో బెంగాల్ తరపున ఆడే షమీ తొలి రెండు మ్యాచుల్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 11న యూపీతో, అక్టోబర్ 18న బీహార్ తో బెంగాల్ తలపడనుంది. ఈ మ్యాచ్ ల్లో ఫిట్ నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ (Test Series) తో జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. కాగా ఈ టెస్ట్ సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ అక్టోబర్ 24, మూడో టెస్ట్ నవంబర్ ఒకటోవ తేదీన జరగనుంది.