Kharge Family: కర్ణాటక భూకేటాయింపుల స్కాంలో ఖర్గే కుటుంబంపై ఆరోపణలు..!!

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge )కుటుంబంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు (BJP Allegations) చేసింది. కర్ణాటకలో ఖర్గే ఫ్యామిలీ నడుపుతున్న ట్రస్ట్ భూమి కేటాయింపు కుంభకోణం(Land allotment scam)లో వారి ప్రమేయం ఉందని తెలిపింది.

ఈ క్రమంలో కుంభకోణంపై సీబీఐ విచారణ (CBI Investigation) జరిపించాలని బీజేపీ డిమాండ్ (Demand) చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటుగా మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని గవర్నర్ కు బీజేపీ విన్నవించింది. కాగా బెంగళూరు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్కులో ఖర్గే కుటుంబం (Kharge Family) నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్ ట్రస్టుకు కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ మెంట్ (Karnataka Industrial Area Development) ఐదు ఎకరాల భూమిని కేటాయిందన్న ఆరోపణలపై వివాదం (Controversy) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ట్రస్ట్ లో సభ్యులుగా మల్లికార్జున ఖర్గేతో పాటు ఆయన సతీమణి రాధాబాయి, కుమారుడు ప్రియాంక్ ఖర్గే, అల్లుడు రాధాకృష్ణ, చిన్న కుమారుడు రాహుల్ ఖర్గే ఉన్నారని సమాచారం. కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే, మంత్రి పదవికి ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.