Badlapur : బద్లాపూర్ లోని ఓ స్కూల్ లో ఇద్దరు నాలుగేళ్ల బాలికల ( 4 Year Old Girls) పై లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు నిరసన (Protests) కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజాగా బద్లాపూర్ బంద్ (Badlapur Bundh) కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బద్లాపూర్ స్టేషన్ లో రైల్ రైకో నిరసనకు దిగారు. దాంతోపాటుగా కర్జాత్ నుండి ముంబైకి వెళ్లే రైళ్లను నిలిపివేశారు. దీంతో బద్లాపూర్ ఏరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు (High Tension) నెలకొన్నాయి. అయితే పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై క్లీనింగ్ వర్కర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే విషయం వెలుగులోకి రావడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతో పాటు క్లీనింగ్ సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.