ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case) లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ మేరకు పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
అయితే, లిక్కర్ పాలసీ ఈడీ(ED) మరియు సీబీఐ(CBI) కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో కవిత పిటిషన్ (Kavita Petition) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కవిత పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ ఆలస్యం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు డైరీ (Case Dairy) ఉండగా బెయిల్ వ్యవహారాల్లో కౌంటర్ దాఖలుకు ఆలస్యం ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా నిన్న సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా శుక్రవారంలోగా కౌంటర్ ఫైల్ (Counter File) చేయాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. అనంతరం పిటిషన్ పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.