అమీన్ పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు…. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: అమీన్ పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు… హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అమీన్ పూర్ చెరువు FTL పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని సూచించిన హైకోర్టు.. నేరుగా లేదా ఆన్ లైన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.