TTD: శ్రీ‌వారి ఆర్జితసేవ టికెట్ల కోటా విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి సేవలు ఉన్నాయి. వర్చువల్ సేవా టికెట్లుఫిబ్రవరి నెలకు సంబంధించిన వర్చువల్ సేవలు మరియు దర్శన స్లాట్‌ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణం టోకెన్లుఅంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఫిబ్రవరి … Read more

Roja: ఎంత మందికి నార తీశారు పవన్ కల్యాణ్ గారూ… : మాజీ మంత్రి రోజా

కూటమి ప్రభుత్వంపై సినీ నటి, మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు.  తిరుపతి జిల్లా వడమాలపేటలో బాలికపై హత్యాచారం జరిగిందంటూ రోజా మండిపడ్డారు. ఇవాళ ఆమె బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అసమర్థత వల్లే నేరస్తులు తెగబడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత సిగ్గుపడాలని మండి పడ్డారు. ఆడవాళ్లను ఎవరైనా బాధపెడితే తొక్కిపట్టి నారతీస్తానని పవన్ గతంలో అన్నారని, ఇప్పటిదాకా 100 మంది ఆడబిడ్డలు ప్రాణాలు … Read more

Tirupati: తిరుపతిలో బాంబు బెదిరింపుల కలకలం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని మరో హోటల్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరో వైపు గురువారం లీలామహాల్ సమీపంలోని మూడు హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు … Read more

Tirumala: గరుడ సేవకు వచ్చే భక్తులకు టీటీడీ తీపి కబురు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీ‌నివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవార గ‌రుడ సేవ నిర్వహించనున్నారు. అందు కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తారు. తిరుమల గరుడ సేవ రోజున 2 లక్షల మంది భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇఓ శ్యామలరావు తెలిపారు. అదనంగా విచ్చేసే భక్తులను క్యూ లైన్ల … Read more

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం అయ్యాయి.ఈ నూతన పరదాలను అత్యంత భక్తిశ్రద్దలతో శ్రీ వేంకటేశ్వరస్వామి మాలధారణ ధరించి సిద్ధం చేస్తారు. తండ్రి.. గోవిందా అంటూ శ్రీవారి పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తిభావంతో తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత మేకల సుబ్రమణ్యం ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే నాలుగు పర్వదినాల్లో ఈ నూతన పరదాలు సమర్పిస్తుంటారు. ఉగాది … Read more

Tirumala visit – YS Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు – నా మతం మానవత్వం.. వెళ్ళి డిక్లరేషన్ లో రాసుకోండి : ప్రెస్ మీట్ లో జగన్

తాడేపల్లి:  తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateswara Swamy) దర్శనం రద్దు చేసుకున్న ఏపీ మాజీ సీయం జగన్ (AP Ex CM YS Jagan), అనంతరం మీడియాతో (Media) మాట్లాడారు. తిరుమల పర్యటన రద్దుకు సంబంధించిన కారణాలను జగన్‌ వివరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తుంది, దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోనే ఎక్కడా జరిగి ఉండవు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయ … Read more