Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం .. భయం భయంగా జనం . ..

దేశరాజధాని ఢిల్లీలో గాలిలో నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యత సూచిక) ఏకంగా 494కు పెరిగింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ నేపథ్యంలో స్ట్రిక్ట్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)-4 ఆంక్షలు అమలు చేస్తున్నారు. గాలి నాణత్య సూచీ 450కు తగ్గినా సరే తమ అనుమతి లేకుండా ఆంక్షలు ఎత్తివేయవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ ఏకంగా 500 … Read more

School Girl:  బాలికపై ఢిల్లీ హోటల్‌లో సామూహిక లైంగికదాడి.. దేశ రాజధానిలో మరో దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందినవారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ నెల 4న ఆమె ఒంటరిగా రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. రైలులో ఆమెకు పరిచయమైన నిందితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌లో 5, 6 … Read more

Supreme Court serious: ఆ ఆలయాలు, దర్గాలు కూల్చాల్సిందే: సుప్రీంకోర్టు

రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురద్వారాలు  ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందేనని తేల్చిచెప్పింది దేశ అత్యున్నత నాయ్యస్థానం సుప్రీంకోర్టు. అంతేకాదు మత విశ్వాసాలు కాదు ముఖ్యం కాదు ప్రజల భద్రతే ముఖ్యం అని ఘాటుగా వ్యాఖ్యానించింది.  బుల్డోజర్ జస్టిస్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు కేసు ఇది..  హత్య, అత్యాచారం కేసులలో నిందితుల ఇంటిపైకి బుల్డోజర్లను పంపిస్తున్నాయని  పలు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు … Read more