ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ కి సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి ఉపశమనం లభించింది. ఇషా ఫౌండేషన్‌లో ”తన ఇద్దరు కూతుళ్లకు బ్రెయిన్‌వాష్ చేసి బలవంతంగా జీవించేలా చేశరు ..” అని కోయంబత్తూర్‌కి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు . . ఈ నేపథ్యంలో సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మహిళలిద్దరూ పెద్దవాళ్లేనని తీర్పునిచ్చింది. అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఇష్టానుసారం ఇషా ఫౌండేషన్‌లో నివసిస్తున్నామని కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఇద్దరు సోదరీమణుల ప్రకటన తర్వాత సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉపశమనం పొందారు.
”మేము ఇద్దరు మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని రికార్డ్ చేశామని, వారిద్దరూ తమ ఇష్టానుసారం అక్కడ నివసిస్తున్నారని ఇలాంటి క్రమంలో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అయితే తమ ఉత్తర్వులు పోలీసుల విచారణను ఆపలేవని ధర్మాసనం స్పష్టం చేయడం గమనార్హం . ఆశ్రమంలో ఏదైనా పొరపాట్లు , ఇబ్బందులు ఉంటే తమిళనాడు ప్రభుత్వం పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.