”వైసీపీ పాలనలో రాజకీయ కక్షలు , ప్రజలను పీడించడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు . వీటిపై ప్రజలలో తీవ్ర తిరుగుబాటు వచ్చింది . అందుకే వాళ్ళని ఇంటికి పంపించారు . దీనిని గుర్తుపెట్టుకోవాలి . .” అని టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు హితవు పలికారు . మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు . గత ప్రభుత్వ్యంలో అరాచకాలకు పాల్పడిన వాళ్ళని చట్టం ప్రకారం శిక్షంచాలే తప్ప . . వేరే రూటులో వెళ్లకూడదన్నరు.
మద్యం విషయంలో పార్టీ నేతలు , ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే ఉపేక్షించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు . వైసీపీకి కోట్ల రూపాయలు ఉన్నా . . ఎన్నికలలో ఖర్చు చేసినా ప్రజలు ఎందుకు తిరస్కరించారో గమనించాలన్నారు .