ITBP Constable Driver Recruitment 2024: 10th అర్హతతో ఐటీబీపీలో 545 కానిస్టేబుల్‌ కొలువులు – దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే ?

Government Jobs:  ప్రభుత్వరంగ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. పదవ తరగతి​ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) 545 కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టులకు సంబంధించిన ప్రకటనను విడదల చేసింది. దీనికి కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ శాశ్వత విధుల్లోకి మార్చవచ్చు. అన్‌రిజర్వ్డ్‌ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ 77, ఎస్టీ 40, ఓబీసీ 164, ఈడబ్ల్యూఎస్‌లకు 55 పోస్టులు కేటాయించారు.

అర్హతలు : పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్‌ పాసై ఉండాలి. దానితో పాటు హెవీ వెహికల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగ అనుభవం ఉంటే సర్టిఫికెట్​కు జతచేయాలి.

వయసు : 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసు సడలింపు ఉంటుంది

దరఖాస్తు ఫీజు : అన్‌రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ : 06.11.2024

వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in